Sunday, September 30, 2018

నీ మనసు మారితే !!!


నీ మనసు మారితే
     నా కోసం వస్తావని
నీ మనసు మారితే
     నా కోసం చూస్తావని
గడిచిన కాలంలో
   మోయలేని భారంతో
        ఎదురు చూస్తుంటా !!!

Wednesday, September 26, 2018

మంచి మాట !!!




మౌనం వీడని మాట (కవిత)



మౌనం వీడని మాట
           మనస్సుని భారం చేస్తుంది
మౌనం వీడని మాట
           మనిషిని దూరం చేస్తుంది
మౌనం వీడని మాట
            కనులతో చెబుతుంది కొత్త భాష
మౌనం వీడని మాట
            మనసులో కల్గిస్తుంది కొత్త ఆశ !!!

Saturday, September 15, 2018

కిడ్నీలు పాడవటానికి కారణం కలుష్యమా ?


ఈ రోజుల్లో వాతావరణం కాలుష్యం మానవ మనుగడపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది మన చేతులరా మనమే చేసుకుంటున్నాం తాజాగా మనం తీసుకునే ఆహారంలో చాలా రసాయనిక చర్యలు జరిపి అవి మనం తీసుకుంటున్నాం దీన్ని వల్ల ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు బయట పడుతున్నాయి ఈ రోజుల్లో సాధారణంగా అందరికి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయి
 ఇవి ముఖ్యంగా మనం తినే ఆహారం వల్లే రాళ్లు ఏర్పడుతాయి మనం తినే ఆహారం కలుషితం అయితే దాని ప్రభావం ముందుగా కిడ్నీలు మీదే పడుతుంది  !!!

Thursday, September 13, 2018

రోబో 2.0 టీజర్ ఆలస్యమైనా అదిరింది !!!


శంకర్ ఈ పేరు బారి బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు ఇప్పటికి చాలా ఆలస్యమైనా రోబో 2.0 టీజర్ వినాయక చవితి సంధర్భంగా నేడు రిలీజ్ అయింది ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న టీజర్ చూసే సరికి సినిమా మీద ఆసక్తి పెరిగింది ఇప్పటికి చాలా ఆలస్యమైనా టీజర్ మాత్రం vfx ఎఫెక్ట్స్ తో, గ్రాఫిక్స్ బాగున్నాయి గ్రాఫిక్స్ ఎక్కువ ఉండటం వల్ల సినిమా అలస్యమవుతుందని శంకర్ చెబుతూనే ఉన్నారు
అటు రజనీకాంత్ కి, ఇటు శంకర్ కూడా ఈ మూవీ విజయం సాధించడం అవసరం ఎంతైనా ఉంది రెహ్మాన్ టీజర్లో background స్కోర్ బాగుంది ఇక అక్షయ్ కుమార్ ప్రతినాయకుని పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంది నవంబర్ 29 వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు!!!

సెప్టెంబర్ 20 న అరవింద సమేత వీర రాఘవ పాటలు !!!


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఎన్టీఆర్ లుక్ ని వినాయక చవితి సంధర్భంగా రిలీజ్ చేశారు ఇక ఈ మూవీ ఆడియోని ఈ నెల 20 న రిలీజ్ చేస్తున్నారు
ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు !!!

Monday, September 10, 2018

సరదాగా కాసేపు


సరదాగా కాసేపు నీతో ఉంటే చాలు
సరదాగా కాసేపు నిన్ను చూస్తుంటే చాలు
సరదాగా కాసేపు నీ ఊసులు వింటే చాలు
సరదాగా కాసేపు నిన్ను బుజ్జగిస్తే చాలు
సరదాగా కాసేపు నిన్ను ఆట పట్టిస్తే చాలు
దానికి మించి ఇంకేం కావాలి ఈ జీవితానికి !!!

  

మంచి మాటలు !!!