Sunday, July 29, 2018

స్నేహమంటే ( నా భావన )స్నేహమంటే 
         మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని తెలియచేసేది
 స్నేహమంటే
          మనలో ఉన్న మంచి, చెడులను మనకు చెప్పేది
స్నేహమంటే
          మన చేసే తప్పుల్ని మనకు తెలియ చేసేది
స్నేహమంటే
           బాధలో భరోసా ఇచ్చేది
స్నేహమంటే
         నిన్ను నువ్వుగా నీకు పరిచయం చేసేది
స్నేహమంటే
         నీ సామర్ధ్యాన్ని నీకు తెలియ చేసేది !!!

Sunday, July 22, 2018

ఆ ఇంటిలో (కథ)


ఉదయం పేపర్ చదువుతూ కూర్చున్నాడు రంగారావు ఇంతలో వాళ్ళవిడ సత్యవతి హఠాత్తుగా పరిగెత్తుకుని వచ్చింది చాలా ఆయాసంగా రొప్పుతూ "ఏమండీ మీ నానమ్మ తులసి  గారు కాలం చేశారు అంటా ఇప్పుడే ఫోన్ వచ్చింది అని చెప్పింది వెంటనే రంగారావు తన భార్య పిల్లలతో కలిసి తన సొంత ఊరు బయలుదేరి వెళ్ళాడు
          అక్కడకు బంధువులు అందరూ వచ్చారు మిగతా కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి ఇంతలో రంగారావు వాళ్ళ నాన్న వచ్చి నానమ్మ ఇద్దరు కొడుకులు నేను, తమ్ముడు బలరాం బలరాం నా చిన్నప్పుడే చనిపోయాడు చెరువులో పడి ఇక మిగిలింది నేనే నాయనమ్మ ఆస్తి ఆమే ఉంటున్న ఇల్లు ఉంది అది నువ్వు మనవడివి కాబట్టి నీకు చెందుతుంది అదే వీలునామా లో కూడా రాసి ఉంది అని చెప్పి ఆ పత్రాలు చూపించాడు రంగా రావు కి వాళ్ళ నాన్న ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తరువాత చూద్దాం అన్నాడు రంగారావు
     అన్ని కార్యక్రమాలు పూర్తి అయినాయి సరే మేము వెళ్తున్నాం అని చెప్పి అక్కడినుండి ఇంటికి బయలుదేరాడు రంగారావు కొన్ని రోజుల తరువాత వాళ్ళ నాన్న రంగారావుక ఫోన్ చేసాడు ఇంటి సంగతి ఏమి చేసావు అని అడిగాడు సరే నాన్న ఇంటి పత్రాలు సిద్ధం చేయండి  నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడు రంగారావు
అన్ని అనుకున్నట్టుగానే పత్రాలు సిద్ధమయ్యాయి రంగారావు రానే వచ్చాడు ఇంటి పత్రాలు తీసుకుని ఒకసారి ఇల్లు ఎలా ఉందో చూద్దామని అక్కడికి వెళ్ళాడు చూడటానికి బాగానే ఉంది కాని బాగా పాతబడి పోయింది దాన్ని బాగుచేసి అమ్మేయటం,లేదా అద్దెకు ఇవ్వొచ్చు అని అనుకున్నాడు రంగారావు ఆ ఇల్లు ఉరికి చివరలో ఉంది  ఆ ఇల్లు తాళం తీసి ఇల్లు చుట్టూ చూసాడు ఎక్కడ చూసినా మొక్కలు తప్పించి మనుషలు ఎవరు కనిపించటం లేదు ఊర్లోకి వెళ్లి కొంతమంది పనివారిని తీసుకువచ్చి ఆ ఇంటిని బాగు చేయించాడు

ఆ తరువాత రోజు తన ఊరు బయలుదేరి వెళ్ళిపోయాడు రంగారావు ఆ ఇంటిని ఏమి చేద్దాం అని ఆలోచించాడు సరే ఒక ప్రకటన ఇద్దాం అని చెప్పి పేపర్లో ప్రకటన ఇచ్చాడు చాలా మంది ఫోన్ చేశారు కానీ ఆ ఇల్లు కుదరలేదు

ఇంతలో ఆ ఉరినుండి ఫోన్ వచ్చింది ఇల్లు అద్దెకు కావాలంట అని వెంటనే రంగారావు ఒప్పుకున్నాడు ఆ ఇల్లు అమ్మేలోపు అద్దె అయిన వస్తుందని ఒప్పుకున్నాడు వెంటనే ఒక ఫామిలీ ఆ ఇంటిలోకి అద్దెకు దిగారు ఒక వారం రోజులు అంతా సజావుగానే సాగింది

ఒక రోజు పక్కనుండి అదో రకమైన కాలుతున్న వాసన వస్తుంది ఆ వాసన చాలా దుర్గంధం వస్తుంది ఏమై ఉంటుందా అని కొంచెం దూరం వెళ్లక చూసాడు ఆ ఇంటిలో ఉంటున్న వ్యక్తి ఎటు చూసినా మొక్కలు కొంచెం దూరం వెళ్ళాక ఒక్కసారి చూసి దీర్ఘంతపోయాడు అది స్మశానం

Thursday, July 19, 2018

ఎదో మాయ చేసి (కవిత )ఎదో మాయ చేసి
మదిలో మంత్ర మేసి
నన్నే నువ్వు మార్చేసావే
   
    కనులలో కలవై
       అందని వరమై
           నన్నే నువ్వు మురిపించావే !!!


Edo maya chesi
    Madilo matramesi
 Nanne nuvvu marchesave
 
     Kanulalo kalay
        Andani varamy
           Nanne nuvvu muripinchave !!!
Tuesday, July 17, 2018

మది అలజడి (కవిత )


ఏమైందో ఏమో కాని
   గుండెల్లో ఎదో అలజడి
     నిన్ను చూసిన క్షణాన మొదలై
         అదే మోయలేని తియ్యని భారమై
             నన్ను కలవరపెడుతుంది!!!

Emaindo emo kani
   Gundello edo alajadi
        Ninnu chusina kshanana modalai
          Ade moyaleni tiyyani bharami
                Nannu kalavarapedutundi !!!

Thursday, July 12, 2018

నా మనసు (కవిత)


నిన్ను చూసిన పూట
నా మనసులో మెదిలిన మాట
నీకు చెప్పాలంటే
మాట తడబడుతుంది కానీ
నా మనసు నీ కోసం కలవరబడుతుంది !!!

Ninnu chusina puta
Naa mansulo medicine mata
Neeku cheppalante
Mata tadabadutundi kani
Naa Manasu nee kosam kalavarabadutundi !!!

Monday, July 9, 2018

టెక్నాలజీ మనలో ఉన్న బద్దకాన్ని పెంచుతుందా ?ఈ ప్రశ్నకు సమాధానం మనం రోజూ చేసే పనిలోనే మనకు అర్థం అవుతుంది ఇదివరకు పని చేయటానికి చాలా శ్రమ పడవలసి వచ్చేది కానీ నేడు ప్రతి పనికి టెక్నాలజీ పుణ్యమా అని మనిషి మరింత బద్దకాన్ని పెంచుతుంది
ఉదాహరణకు : బట్టలు ఇదివరకు చేతితో ఉతికేవారు కానీ నేడు వాషింగ్ మెషిన్ వాడుతున్నారు
                      పొయ్యి మీద వంట చేసే వారు నేడు గ్యాస్ స్టవ్, electrive స్టవ్ ఇలా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి ఇవి మన శారీరక శ్రమను తగ్గించవచ్చు కానీ దీని వల్ల మనిషిలో ఉన్న బద్దకం మరింత పెరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు


మనిషికి శారీరక శ్రమ లేకపోవటం వల్లనే త్వరగా అనారోగ్యాలు పాలు అవ్వటం అనేది జగమెరిగిన సత్యం టెక్నాలజీ తెచ్చిన సౌకర్యాలు వల్ల మనిషి మరింత బద్ధకంగా తయారు అవుతున్నాడు ఏదైనా కొనటానికి అయిన సరే మనిషి ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాడు టెక్నాలజీ అభివృద్ధి చెందటంలో తప్పు లేదు కానీ ఆ టెక్నాలజీ తో వచ్చే సౌకర్యాలకు మానవుడు బాగా అలవాటు పడిపోతున్నాడు !!!

Sunday, July 8, 2018

తొలకరి చిరుజల్లు !!!


తొలకరి చిరుజల్లులో
మేను పులకరింపుగా
 సదా నీ పలకరింపుకి
ఎదురుచూస్తుంటుంది
             నా మది !!!

Tolakari chirujallulo
Menu palakarimpaga
Sada nee palakarimpuki
Eduruchustuntundi
       Naa madi !!!

Friday, July 6, 2018

మన ప్రేమ (కవిత)


నా మనసులో నీ రూపం చిరకాలం
నా  ప్రతి మాటలో  నీ పేరు నాకిష్టం
నిన్ను చూసే ప్రతి క్షణం నాకు వరం
నీ కోసం ఎదురు చూడటంలో కూడా
   ఎంత హాయ్ ఉందొ నిన్ను కలిసాకే తెలిసింది
 నేను నీతో గడిపే ప్రతి నిమిషం
   మన ప్రేమకు అంకితం !!!


Naa manasulo nee rupam chirakalam
 Naa prati matalo nee peru  naa kishtam
Ninnu chuse prati kshanam naku varam
Nee kosam eduru chudatamlo kudaa
  Enta hai undo ninnu kalisake telisindi
Nenu neeto gadipe prati nimisham
   Mana premaku ankitam !!!!

Wednesday, July 4, 2018

ఓ మనిషి ఎక్కడుంది నీ మనసు ?


         ఓ మనిషి !!!
సంతోషం ఎక్కడుంది
      మనలోన, మనసులోన
సంతృప్తి ఎక్కడుంది
   ఇవ్వటంలోన, తీసుకోవటంలోన
సాయం ఎక్కడుంది
  కోరడంలోన, ఇవ్వటంలోన
బంధం ఎక్కడుంది
  నిలుపుకోవటంలోన, వదులుకోవటంలోన
 
ఎటువైపు నీ పరుగు
    ఎక్కడికి నీ ఉరుకు !!!
 
   
      

Tuesday, July 3, 2018

అదిగో దెయ్యం ( కథ )


సమయం రాత్రి 11.30 దాటుతుంది తన సైకిల్ పై బయలుదేరి వెళ్ళాడు ప్రకాశం తాను ఫ్యాక్టరీ లో లేబర్ గా పనిచేస్తున్నాడు కొంచెం దూరం వెళ్ళాక అంతా నిర్మానుష్యంగా ఉంది ఎవరు కనిపించడంలేదు  వీధి లైట్ లు కూడా వెలుగు లేదు తన చేతిలోని టార్చ్ లైట్ సహాయం తో ముందుకు వెళ్తున్నాడు
      కొంచెం దూరం వెళ్ళాక ఎవరో వ్యక్తి లాగా ఒక ఆకారం కనిపిస్తుంది కానీ స్పష్టంగా కనిపించటం లేదు  అలాగే భయం,భయంగా వెళ్తున్నాడు ఒక్కసారిగా ఒక వెలుగు కనిపించింది అంతే వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు ప్రకాశం
      కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్ లో ఉన్నాడు పక్కన ప్రకాశం స్నేహితుడు రమేష్ ఉన్నాడు " ఏమైంది రా అక్కడ పడి యున్నావు అని అడిగాడు "
నేను ఎప్పటి మామూలుగానే డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళాను కొంచెం దూరం వెళ్లిన తరువాత అంతా చీకటిగా ఉంది అక్కడ ఏదో ఆకారం లాగా కనిపించింది నేను బయపడుతూనే వెళ్ళాను అక్కడ ఏదో వెలుతురు లాగా వచ్చింది ఆ తరువాత నాకు ఏమైందో అర్తం కాలేదు అని చెప్పాడు
సరే రేపు మనిద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు రమేష్
   ఆ తరువాత రోజు ఇద్దరు కలిసి వెళ్లారు అక్కడికి అదే సమయానికి వెళ్లి అక్కడికి చుట్టూ చూసారు కానీ ఎక్కడకనిపించలేదు సరే అని చెప్పి తిరిగి వెనుకకు వెళ్తున్నారు ఇంతలో ఎదో అలికిడి వినిపించింది అటుగా చూసారు వారిద్దరూ మరలా అలాగే ఆకారం కనిపించింది
   ఇక ఇద్దరు ఒకేసారి అలాగే ఉండిపోయారు కాసేపటికి ఆ ఆకారం వారి దగ్గరకు వస్తుంది ఇక మరు నిమిషం ఆలోచించకుండా ఇద్దరు పరుగు అందుకున్నారు
     ఆ మరుసటి రోజు ఉదయం ఆ ప్రదేశానికి వెళ్లారు వీరిద్దరికి అక్కడి కొంచెం దూరంలో ప్రకాశం పనిచేసే ఫ్యాక్టరీ మరొక వ్యక్తి ఇల్లు ఉంది అతని పేరు సింహచలం
అతను నెల ముందే ఫ్యాక్టరీలో ప్రమాదం శాత్తూ మరణించాడు
   సరే ఒకసారి అతని ఇంటికి వెళ్దాంఅనుకుని వెళ్లారు
ఇంట్లో సింహచలం భార్య ఉంది ఇంటిలోకి రమ్మని పిలిచింది ఆవిడ
మా ఆయన చనిపోక ముందు రోజు తాను పని చేసే ఫ్యాక్టరీలో అవకతవకలు జరుగుతున్నాయని అవి గ్రహించి తన యజమానులు దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు
అంతలోనే ఇలా అయిపోయింది అని చెప్పి ఏడ్చింది వాళ్ళవిడ సరే అని అక్కడినుండి బయలుదేరి వెళ్లిపోయారు
ఎప్పటి మామూలుగానే డ్యూటీకి బయలుదేరి వెళ్ళాడు ఇంతలో superviser హడావుడిగా ఎదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడు
ప్రకాశంకి అనుమానం వచ్చి వెంబడించాడు అతని మాటల్లో సింహ చలం చంపిన విషయం వచ్చింది తన మొబైల్ తీసుకుని అంతా రికార్డ్ చేసి police స్టేషన్ లో complaint  ఇచ్చాడు
పోలీస్లు ఆ సాక్ష్యంతో అతనిని అరెస్ట్ చేశారు అతనిని విచారించగా సింహచలం నేనె చంపానని ఒప్పుకున్నాడు

నేను ఇక్కడ తయారయ్యే ముడి సరుకు కొద్దిగా బయటకు అమ్ముకునేవాన్ని ఆ విషయం చాలామందికి తెలుసు కానీ ఎవరూ యజమానులకు చెప్పే ధైర్యం చేసేవారు కాదు సింహ చలం చెబుతానని బెదిరించాడు అందుకే అతనిని చంప వలసి వచ్చింది అని చెప్పాడు superviser

అప్పటి నుండి ప్రకాశంకి మరలా ఆ ఆకారం ఎప్పుడు కనిపించలేదు బహుశా ఆ ఆత్మ సింహ చలం అయి ఉంటాది అని అనుకున్నాడు ప్రకాశం.

Monday, July 2, 2018

పంచుకోవటంలొనే జీవితం ఉంది ?పంచుకోవటంలోనే జీవితం ఉంది
     సంతోషమైన, బాధైనా
పంచుకోవటంలోనే ఆనందం ఉంది
      బరువైన, బాధ్యతయిన
పంచుకోవటంలోనే ప్రేమ ఉంది
     అభిమానమైన, అనురాగమైన
పంచుకోవటంలోనే స్నేహం ఉంది
     బాసటగానైనా, భరోసాగానైనా
పంచుకోవటం అంటే మనకు నచ్చినది
        మనసుకు నచ్చిన వారికి ఇచ్చేది !!!

మంచి మాటలు !!!