Saturday, June 30, 2018

నీ ఉంటే చాలు నా వెంట (కవిత)


నీ ఉంటే చాలు  నా వెంట
    ఎన్ని కష్టాలు అయిన భరించటానికి
 నీ ఉంటే చాలు నా వెంట
       సంతోషాలును పంచుకోవటానకి
నీ ఉంటే చాలు నా వెంట
     సమస్యలను పరిష్కరించటానికి
 నీ ఉంటే చాలు నా వెంట
     బాధల్ని చెప్పుకోవటానకి
నీ ఉంటే చాలు నా వెంట
   భరోసా ఇవ్వటానికి
నీ ఉంటే చాలు నా వెంట
   నా బాధ్యత గుర్తు చేయటానికి
నీ ఉంటే చాలు నా వెంట
    ఓటమిలో  ఓదార్చటానికి
నీ ఉంటే చాలు నా వెంట
    విజయంలో వెన్ను తట్టటానికి
 ఇప్పటికి , ఎప్పటికి
         నీ ఉంటే చాలు నా వెంట !!!

Friday, June 29, 2018

తొలి చూపులోనే (కథ)


సమయం ఉదయం 9.30 అవుతుంది హడావుడిగా వచ్చి షాప్ తాళం తీస్తున్నాడు  కిరణ్  సెల్ పాయింట్ నడుపుతున్నాడు  షాప్ అంతా క్లీన్ చేసి కౌంటర్లో కూర్చున్నాడు కాసేపటికి ఒక అమ్మాయి వచ్చింది స్కార్ఫ్ తో మొహం కప్పేసి ఉంది మొబైల్ రీఛార్జి కోసం వచ్చింది కానీ కిరణ్ దగ్గర బ్యాలన్స్ లేదు కాసేపటికి బ్యాలన్స్ వేస్తాను మీ మొబైల్ నెం , అమౌంట్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పాడు ఆ అమ్మాయి అలాగే ఇచ్చేసి వెళ్ళింది కాసేపటికి కిరణ్ ఆ అమ్మాయి నెంబర్ కి రీఛార్జి చేసాడు   అలా ప్రతి వారానికి ఒకసారి ఆ అమ్మాయి వచ్చి రీఛార్జి చేయించుకుని వెళ్ళేది
అలా కొన్ని రోజుల తరువాత  చాలా రోజులు ఆ అమ్మాయి కనిపించలేదు ఆ తరువాత రోజు ఫోన్ కి message వచ్చింది
అందులో plz recharge చేయండి నేను మీ షాప్ కి వచ్చే అమ్మాయిని అని చెప్పి నేను వేరే ఊరులో ఉన్నాను అమౌంట్ వచ్చాక ఇస్తాను అని message వచ్చింది
వెంటనే కిరణ్ ఆ నెంబర్ కి రీఛార్జి చేసాడు
రెండు రోజులు తరువాత ఆ అమ్మాయి ఆ షాప్ కి వచ్చి అమౌంట్ ఇచ్చింది అప్పుడు కిరణ్ మీ పేరు ఏంటి అనడిగాడు దానికి ఆ అమ్మాయి నా పేరు స్వాతి అని చెప్పింది ఇక అప్పటి నుండి రోజు ఇద్దరు messge లు ఫోన్ మాట్లాడటం , మంచి ఫ్రెండ్స్ కింద మాట్లాడుకుంటూ ఉండేవారు
 ఒకరోజు ఇది ప్రేమ అనుకుని  కిరణ్ ఆ అమ్మాయికి  ప్రపోజ్ చేద్దామనుకున్నాడు  ఇంతలో ఆ స్వాతి రానే వచ్చింది ఇద్దరు మాట్లాడుకున్నారు
మాటల్లో నేను రేపు నీతో ఒక మాట చెప్పాలి అన్నాడు సరే రేపు మా college దగ్గర పార్క్ దగ్గరకు రండి అని చెప్పి వెళ్లి పోయింది
రేపు ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు కిరణ్ ఆ మరుసటి రోజు రానే వచ్చింది  ఎంతో ఆతృతగా బయలు దేరి వెళ్ళాడు  ఎంత సేపు చూసినా స్వాతి రావటం లేదు వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేసాడు కానీ ఆ నెంబర్ కలవలేదు
కిరణ్ కి స్వాతి ఇల్లు కూడా తెలియదు రాత్రి దాటింది అయిన కూడా రావటం లేదు నెంబర్ కలవటం లేదు
సరే ఇంటికి వెళ్దాం అని బయలుదేరాడు కిరణ్
 దారిలో జనం గుమి గుడి ఉన్నారు ఏమైందో చూద్దాం అని అటువైపు వెళ్ళాడు అక్కడ ఒక అమ్మాయి ఒళ్ళంతా రక్తంతో చనిపోయి ఉంది ఆమె ఎవరో కాదు స్వాతినే !!!

Wednesday, June 27, 2018

అసలు ఏమి జరిగింది ? (కథ)ఫోన్ రావటంతో హుటాహుటిన బయలుదేరాడు ఇన్స్పెక్టర్ మహేష్ త్రిపాఠి అది ఊరికి చివరన ఉన్న జమీందారు గారి బంగళాకి అక్కడ చేరుకున్న తరువాత అక్కడ ఒక శవం స్విమ్మిం ఫూల్ లో మునిగి పోయి ఉంది మరొకటి స్విమ్మింగ్ ఫూల్ దగ్గరగా ఉన్న గార్డెన్ లో మరొకటి ఉంది విచిత్రమేమిటంటే స్విమ్మింగ్ ఫూల్ లో ఉన్నది ఆడ శవం గార్డెన్ లో ఉన్నది మగ శవం

స్విమ్మింగ్ ఫూల్ లో చనిపోయింది గార్డెనింగ్ లో ఉన్న మనిషి షూట్ చేయటం వల్ల జరిగింది అయితే గార్డెన్ లో చనిపోయిన వ్యక్తి ఎలా మరణించాడు అన్నది అంతు చిక్కని ప్రశ్న లాగా ఉంది వెంటనే మృత దేహాలకు పంచనామా చేయటానికి తీసుకువెళ్లారు
ఇన్స్పెక్టర్ మహేష్ అక్కడ ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని చుట్టూ చూస్తున్నాడు కానిస్టేబుల్ చేత ఆ బంగాళలో పనిచేసే వారందరిని పిలిపించమన్నాడు కాసేపటికి ఇద్దరు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆ బంగాళలో పనిచేస్తుంది ఇద్దరు మాత్రమే ఒకరు పని మనిషి సుబ్బమ్మ, మరొకరు తోటమాలి రామనాథం ఇద్దరు భార్య భర్తలు ఆ బంగాళలో 10 సంవత్సరాలుగా పని చేస్తున్నారు

ఇన్స్పెక్టర్ మహేష్ చనిపోయిన వీళ్ళిద్దరూ ఎవరు అనడిగాడు వాళ్లిద్దరూ వైపు చూస్తూ ఆవిడ ఇంటి ఓనర్ గారి భార్య తులసి గారు అన్నాడు మరి ఆ మరో వ్యక్తి ఎవరు అన్నాడు అతను ఎవరో నాకు తెలియదు ఈ బంగళకి అప్పుడప్పుడు ఓనర్ గారు, వాళ్ల ఆవిడ వస్తుంటారు ఈ సారి మాత్రం ఈవిడ ఒక్క ఆవిడే వచ్చింది అని చెప్పాడు రామనాథం సరే ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పారా అనడిగాడు ఇన్స్పెక్టర్ మహేష్ చేసాం సర్ వస్తున్నాను అన్నారు

కాసేపటికి ఓనర్ వచ్చాడు ఇన్స్పెక్టర్ మహేష్ మీరెవరు అనడిగాడు నేను ఈ ఇంటి ఓనర్ నా పేరు కృపాకర్ అంటూ ఏడుస్తూ తన భార్య ఏది అని అడిగాడు post martam కి పంపాము అది అయ్యాక మీకు అప్పగిస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ మహేష్
హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నాడు మహేష్ post మార్టం రిపోర్ట్స్ వచ్చాయి ఆవిడ తుపాకీ గుండు తగిలి చనిపోయాడు అని వచ్చింది అతనికి మాత్రం ఒంటి నిండా ఎదో పక్షి గీరినట్టు గీతలుతో దానిలోని విషం వల్ల చనిపోయినట్టు వచ్చింది

ఆ కృపాకర్ ఇంటికి బయలుదేరాడు ఇన్స్పెక్టర్ మహేష్ అక్కడ ఎవరు కనిపించలేదు కానీ అతడికి అక్కడ కొన్ని డేగ పక్షులు అక్కడ పంజరం లో ఉండటం చూసాడు వెంటనే అనుమానం వచ్చింది కృపాకర్ మొబైల్ ట్రేస్ చేసాడు అది ఆ బంగళకు దగ్గర లో ఉన్న ఫారెస్ట్ లో చూపిస్తుంది వెంటనే కొంతమంది కానిస్టేబుల్స్ తీసుకుని అక్కడికి వెళ్ళాడు అక్కడ చుట్టూ చూసాడు కానీ ఎవరూ కనిపించలేదు అక్కడ ఒక గదిలో మూలుగుతూ ఒక స్వరం వినిపించి అక్కడికి వెళ్ళాడు అక్కడ ఉన్నాడు కృపాకర్ కట్టేసి ఉన్నాడు అతడిని విడిపించి మర్యాదగా జరిగిందంతా చెప్పు అనడిగాడు మహేష్ కృపాకర్ ని


కృపాకర్ నేను నా పార్టనర్ పరశురాం ఇద్దరు కలిసి గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళం మా ఇద్దరి చాలా సన్నిహితం గా ఉండేవాళ్ళం తాను నా భార్య ఒకప్పటి ప్రేమికులు నాకు వారిద్దరూ మీద ఎప్పుడు అనుమానం మొదలైందో అప్పటి నుండి అతనితో వ్యాపారం మనేసాను అతను మాత్రం నా భార్యను వేధించేవాడు అని చెప్పాడు

అతను ఎక్కడ అనడిగాడు మీరు రావటం చూసి పరిపోయినట్టున్నాడు అని చెప్పాడు వెంటనే బయటకు వెళ్లి చూసాడు కొద్దీ దూరంలో కారు వేగంగా వెళ్ళటం చూసాడు వెంటనే తన కారులో వేగంగా వెళ్లి ఆ కారును ఆపాడు మహేష్ అందులో ఉన్నది పరశురాం వెంటనే అతడ్ని అరెస్ట్ చేసి తులసిని ఎందుకు చంపావు అన్నాడు నా మాట విని మనం ఎక్కడికి అయిన వెళ్ళిపోదాం అని చెప్పిన వినలేదు అందుకే అందుకే నేను ఆ బంగాళలో ఒంటరిగా ఉందని తెలుసుకుని వెళ్లి తనని చంపాను అని చెప్పాడు పరశురాం
మరి ఆ మరొక వ్యక్తి ఎవరు అని అడిగాడు అతను కృపాకర్ బాడీగార్డు అతడిని ముందుగానే నేను పెంచుకుంటున్న డేగ కాళ్ళ లో విషం నింపి అతడిని చంపాను అని చెప్పాడు
నేను, కృపాకర్ ఆ డేగాల్ని ఆస్ట్రేలియా నుండి తెప్పించుకుని పెంచుకుంటున్నాము అని చెప్పాడు
మరి కృపాకర్ ని ఎందుకు చంపాలనుకున్నావ్ అనడిగాడు ఇన్స్పెక్టర్ మహేష్ తన భార్యని చంపింది నేనె అని చెబుతాడాని తనని కూడా చంపుదామని అని చెప్పాడు
వెంటనే పరశురాం ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు మహేష్ !!!

Tuesday, June 26, 2018

నువ్వంటే నాకిష్టం


నువ్వంటే నాకిష్టం
   నా బాధను నీతో పంచుకుంటాను కాబట్టి
నువ్వంటే నాకిష్టం
   నా ఇష్టాలును నీతో పంచుకుంటాను కాబట్టి
నువ్వంటే నాకిష్టం
   నా కోపాన్ని నువ్వు భరించగలవు కాబట్టి
నువ్వంటే నాకిష్టం
   నా కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు కాబట్టి
నువ్వంటే నాకిష్టం
    ఎందుకంటే నా మనసులో ఉన్నది ఎప్పటికి
         నువ్వే కాబట్టి !!!

Nuvvante nakishtam
    Naa badhanu neeto panchukuntanu kaabatti
Nuvvunte nikishtam
     Naa ishtalunu neeto panchukuntanu kaabatti
Nuvvante nakishtam
     Naa kopanni nuvvu bharinchagalavu kaabatti
Nuvvante nakishtam
     Naa kashtanni nuvvu artam chesukogalavu kaabatti
Nuvvante nakishtam
     Endukante naa manasulo unnadi eppatiki
          Nuvve kaabatti !!!Monday, June 25, 2018

మారుతున్నది కాలం ?


అవును మారుతున్నది కాలం,  మనిషి మాత్రం మారటం లేదు  మనుషులు మారాలంటే ముందు వారి ఆలోచన విధానం మారాలి ఆచరణ మార్గం మారాలి
 రోజులు,  వారాలు, సంవత్సరాలు, మారుతున్నాయి కానీ మనం మాత్రం స్వార్థం, అసూయ, అనుమానం, గర్వం  వీటి వల్ల మనుషుల్లో మార్పు అనేది కనిపించటం లేదు ఒక మనిషి లో మార్పు రావటానికి అతని ఆలోచన మారటం మొదట లక్షణం అయితే ఆ మార్పును ఎంత  కష్టమైన సాధించే సత్తా కల్గి ఉన్నపుడే మనుషుల్లో మార్పు మొదలవుతుంది
మనిషికి మనిషికి మధ్య పలకరింపులే చాలా తక్కువ అవుతున్న ఈ రోజుల్లో మనిషిలో మార్పు గురించి మాట్లాడటం అవివేకం అవుతుంది సహాయం అనేది ఒక్క మానవ జన్మకు దేవుడు ఇచ్చిన గొప్ప లక్షణం ఆ గుణం ప్రతి మనిషిలో మొదలు అయినప్పుడే మనిషిలో మార్పు అన్నది సాధ్యపడుతుంది
సహాయం చేయలేని స్థితిలో ఉన్న సరే కనీసం ఆ సమస్యకు స్పందించడం కూడా మానవ ధర్మం 

Sunday, June 24, 2018

సెల్ ఫోన్ కింద పడి on అవ్వకపోతే ?ఈ రోజుల్లో సెల్ ఫోన్ అనేది మానవ శరీర భాగాలలో ఒక భాగం అయింది అనే దానిలో ఎలాంటి అనుమానం లేదు మనం ఏ పనికైనా మొదట ఉపయోగించే వస్తువు ఏదైనా ఉందంటే అది ఒక్క సెల్ ఫోన్ మాత్రమే లెక్కలు నుండి చెల్లింపులు దాకా అన్ని కార్య కలపాలు సెల్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి

సెల్ ఫోన్ లేనిదే ఈ ప్రపంచం ఆగి పోతుంది అన్నట్టుంది ప్రపంచం నేడు అయితే విషయమేమిటంటే పొరపాటునో గ్రహాపాటునో ఒక్కోసారి మొబైల్ చేజారి కిందికి పడిపోతుంది వెంటనే టచ్ మిగిలిపోతుంది ఒక్కోసారి మొబైల్ పడిన వెంటనే ఫోన్ on అవుతుంది ఒక్కోసారి ఫోన్ on అవ్వదు

ఫోన్ on అవ్వకపోతే మొదటగా మనం చేయాల్సింది :::

(1) కింద పడిన వెంటనే మొబైల్ fix చేసి ఛార్జింగ్ పెట్టాలి 15 నిమిషాలు
(2)  అప్పటికి on అవ్వకపోతే బ్యాటరీ రెండు చేతులతో rough చేయాలి ఇలా rough చేయటం వల్ల బ్యాటరీ లోకి ఉష్ణ శక్తి ఏర్పడి ఫోన్ on అయ్యే అవకాశం ఉంటుంది
(3) అప్పటికి ఫోన్ on అవ్వకపోతే బ్యాటరీ నాలుక చివరన పెట్టుకుంటే కొద్దిగా shock తగిలినట్టు ఉంటే బ్యాటరీ పరిస్థితి బాగానే ఉన్నట్టు
(4) అలా ఉండక పోతే బాటరీ discharge అయినట్టు
(5) ఒక వేళ బాటరీ discharge అయితే ఏదైనా మొబైల్ షాప్ లో బ్యాటరీ boosting  పెడితే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది !!!

Saturday, June 23, 2018

జీవితమంటే ? ( నా భావన )


జీవితమంటే
  ఎదో సాధించాలని ఆశ
జీవితమంటే
 ఆనందాన్ని ఆస్వాదించాలి
జీవితమంటే
   బాధని భరించాలి
జీవితమంటే
     ఎదుటివారికి  మనకు చేతనైన సహాయం చేయాలి
జీవితమంటే
    కల గన్న దాని కోసం కష్ట పడాలి
జీవితమంటే
    బాధ్యతతో ఉండాలి !!!Jeevitamante
    Edo sadhinchalani aasa
Jeevitamante
     Ananadanni aaswadinchali
Jeevitamante
      Badhani bharinchali
Jeevitamante
     Eduti variki manaku chetanaina sahayam cheyali
Jeevitamante
      Kala ganna dani kosam kashtapadali
Jeevitamante
     Badhyatato undali !!!

మొబైల్ ఫోన్ బంధాలను విడదీస్తుందా ?


మొబైల్ ఫోన్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ చిన్న పరికరంలో దాగి ఉంది అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే మానవ మనుగడలో మొబైల్ ఫోన్ అంత ప్రముఖ పాత్రను నిర్వహిస్తుంది అయితే మొబైల్ ఫోన్ రావటం వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అంత దుష్ప్రభావం కూడా దాగి ఉంది

ప్రస్తుత పరిస్థితిలో purse లేకున్నా బయటకు వెళ్ళవచ్చు గాని మొబైల్ లేకుండా బయటకు వెళ్ల లేని పరిస్థితి ఏర్పడింది ఈ డిజిటల్ యుగంలో అంతా online లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి బయటకు ఎక్కడకు వెళ్లిన ఫోన్ ద్వారా చెల్లింపులు జరపటం జరుగుతుంది

ప్రజలు కూడా మనీ carry చేయటానికటే మొబైల్ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు online లావాదేవీలు వచ్చినప్పటి నుండి పని ఎంత సులువుగా అవుతుందో అంతే ఎక్కువుగా మోసాలు జరుగుతున్నాయి
అయితే ఈ మధ్య కాలంలో online మోసాలు కొద్దిగా తగ్గినట్టే అనిపిస్తున్నాయి  మొబైల్ ఫోన్ వ్యాపార పరంగా కాకుండా మానవ సంబంధాలు కూడా దెబ్బ తింటున్నాయి ఇదివరలో landline వాడే కాలంలో ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారనేది తెలిసిపోయేది కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చిన తరువాత అబద్దాలు ఎక్కువ అవుతున్నాయి
అంతే కాకుండా సామాజిక మాధ్యమాలు ద్వారా కూడా అసత్య ప్రచారాలు, వ్యక్తిగత మనోభావాలు దెబ్బతినే విధంగా తయారయ్యాయి మొబైల్ ఫోన్ ద్వారా మనుషులు దూరంగా ఉన్నవారిని దగ్గర చేయటం అటుంచి అసలు మానవ సంబంధాలు దెబ్బ తీస్తున్నాయి 

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కూడా ఫోన్ పెద్దవాళ్ళు ఫోన్ అలవాటు చేస్తున్నారు దీనివల్ల వారి శారీరక అభివృద్ధి పై సన్నగిల్లుతుంది !!!
మనిషి మీద మనిషికి నమ్మకం తగ్గుతుంది ఈ ఫోన్ వల్లే అనటం లో ఎలాంటి సందేహం లేదు

Friday, June 22, 2018

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ( టిఫిన్) మానకూడదు ఎందుకంటే ?


మనం రోజంతా ఉత్సాహంగా ఉండడానికి బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి బ్రేక్ ఫాస్ట్ అనేది మనం రాత్రి విశ్రాంతి తీసుకున్న తరువాత మనలో శక్తిని తిరిగి పొందడానికి బ్రేక్ ఫాస్ట్ చేయాలి అలా క్రమం తప్పకుండా తీసువటం మన ఆరోగ్యానికి చాలా మంచిది

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవటం వల్ల కలిగే దుష్పరిణామలు :::

(1) క్రమంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే మనకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి
(2) అంతే కాకుండా ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి
(3)  ఆ రోజంతా నిరుత్సాహంగా ఉంటారు
(4) ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది
(5) వయసు రాకుండా వచ్చే అన్ని రోగాలకు మొదటి కారణం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్లే


బ్రేక్ ఫాస్ట్ అంటే ఏది పడితే అది తిన కూడదు నూనె పదార్దాలు తినకుండా ఉంటేనే మంచిది మన పెద్దలలో చాలామంది ఇప్పటికి ఏ అనారోగ్యం రాకుండా ఉంటారు దానికి కారణం వారు తినే తిండి వారు ఎక్కువుగా మంచి మంచి ఆహారపు అలవాట్లు పాటించారు కాబట్టి వారు ఆరోగ్యం గానే ఉంటారు

కాక పోతే తీసుకునే ఆహారం చాలా తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది !!!

Ear phones తో జర భద్రం !!!టెక్నాలజీ అన్నది ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతే ఎక్కువగా ప్రమాదాలను కొని తెచుకుంటున్నట్టుంది పరిస్థితి మనం సాధారణంగా మొబైల్ వాడేటప్పుడు పాటలు వినటం కోసం ear phones వాడటం జరుగుతుంది
Ear phones వాడటం మంచిదే కానీ అతిగా వాడటం మంచిది కాదు ear phonesలో కొద్దీ సేపు మాత్రమే  పాటలు వినాలి అంతే కదా అని ఎక్కువ సార్లు అదే పనిగా వాడటం వల్ల వినికిడి సమస్యలు తలెత్తుతాయి
ఫోన్ ఎక్కువ సేపు మాట్లాడేవారికి ear phones వాడటం ఎంతో మంచిది మొబైల్ నుండి వెలువడే రేడియేషన్ తగ్గించటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది


Ear phones లో పాటలు తక్కువ valume తో వినటం మంచిది ట్రాఫిలో ear phones అసలు వాడకూడదు
బైక్ మీద  ear phones లో వాడటం అంత మంచిది కాదు.
అంతే కాకుండా మొబైల్ తో పాటు వచ్చే ear phones కాకుండా వేరే ear phones వాడటం వల్ల మీకు అసౌకర్యంగా ఉంటుంది మొబైల్ లో కూడా సమస్యలు తల ఎత్తే అవకాశం ఎక్కువుగా ఉంటుంది ear phones తో ఎక్కవ సేపు పాటలు వినడం ద్వారా తల నొప్పి వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది

Ear phones వాడండి కానీ అవసరం కొరకే వాడండి మొబైల్ కొన్న వెంటనే  ఆ బాక్స్ లో అన్ని accessaries  సరిగా ఉన్నాయో లేదో చూసుకుంటాం కానీ user mannual ఎవరు చదవరు ఆ manual చదివితే ఆ ఫోన్ ఎలా వాడాలో ఏ accassaries ఎలా వాడాలో తెలుస్తుంది !!!

పైన పేర్కొంబడిన విషయాలు మీకు తెలిస్తే పర్వాలేదు కానీ తెలియని వారు ఉంటే వారికి తెలియచేయటనికి !!!


నీవెవరో నీవెవరో (కవిత)నీవెవరో  నీవెవరో !!!
       కనబడని కలవో
        మదిని ముంచే అలవో
          ఊపిరి పొసే ఉసురువో
             ప్రాణం పొసే ప్రేయసీవో

నీవెవరో నీవెవరో !!!
    మోయలేని చిరు భారమై
     మందులేని చిన్న గాయమై
      ఎదలో గుచ్చుకున్న బాణమై
         ఎప్పటికి మరిచి పోలేని జ్ఞాపకమై

ఎవరో నీవెవరో !!!


Neevevaro neevevaro !!!
   Kanbadani kalavo
   Madini munche alavo
   Usuru pose upirivo
  Pranam pose preyasivo

Neevevaro neevevaro !!!
     Moyaleni chiru bharami
      Manduleni chinna gayami
       Edalo guchukunna banami
         Eppatiki marchipoleni jnapakami


Evaro neevevaro !!!

Thursday, June 21, 2018

చిరు నవ్వు (కవిత)


ఒక చిన్న చిరునవ్వు చాలు
   ఎదుట వ్యక్తిని పలకరించటానికి
ఒక  చిన్న చిరు నవ్వు చాలు
    మనసులో ఉన్నా వారు ఎదురుగా కనబడితే మది పలకరించటానికి
ఒక చిన్న చిరునవ్వు చాలు
    బంధాలను మరింత బలపడేలా చేయటానికి
ఒక చిన్న చిరు నవ్వు చాలు
      మనసులో ఉన్న బాధని ఆ క్షణం  మరవటానికి
ఒక చిన్న చిరు నవ్వు చాలు
     మనకున్న అందం మరింత రెట్టింపు అవటానికి !!!


Oka chinna chirunavvu chalu
      Eduta vyaktini palakarinchataniki
Oka chinna chirunavvu chalu
    Manasulo unnavaru eduruga kanapadite madi pulakarinchataniki
Oka chinna chirunavvu chalu
     Badhalunu marinta balapadela cheyataniki
Oka chinna chirunavvu chalu
    Manasulo unna badhani aa kshanam maravataniki
Oka chinna chirunavvu chalu
    Manakunna andam marinta rettimpu avvataniki !!!
Wednesday, June 20, 2018

నీ కోసం (కవిత)ఎడారి లాంటి నా మనసులో ఎండ మావిలా కనిపించావు
చేరువయ్యే కొద్దీ దూరం అయ్యావు
కలలకు దగ్గరగా, కనులకు దూరంగా
మదినిండా మరి మోయలేని భారంగా
నీవు కనబడని క్షణము
  నాకు రణం
నీతో మాట్లాడే క్షణం
 నాకు వరం
నీ కోసం వేచి ఉండే
నీ ప్రియతమభిలాషి !!!Edari lanti naa mansulo enda nabi laa kanipinchadu
Cheruvayye koddi duram ayyavu
Kalalaku daggaraga kanulaku duramgaa
Madi ninda mari moyaleni bhaaramga
Neevu kanabadani kshanam
 Naku ranam
Neeto matlade kshanam
 Naaku varam
Nee kosam vechi unde
Nee priyatamabhilashi !!!

పండు గాడి ప్రేమ క(గా)థ


ఒకసారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి రా రా అంది పండు వాళ్ల అమ్మ సుహాసిని పండుతో ఇప్పుడే పరీక్షలు అయినవి రెండు రోజులలో వెళ్తాను అమ్మ అన్నాడు పండు వాళ్ళ అమ్మతో సరే అంది

ఇంతలో పండు స్నేహితుడు సురేష్ ఇంటికి వచ్చాడు  ఏరా! ఎలా ఉన్నావు అనడిగాడు ఏంటి హాలిడేస్ ప్లానింగ్ ఏంటి అనడిగాడు ఏమీలేదు నేను సెలవలకు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాను మన వాళ్ళందరూ చాలా టూర్ లు ప్లాన్ చేసుకున్నారు మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు అనడిగాడు పండు సురేష్ ని

నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాడు పండు ok రా నేను వెళ్తున్నాను మళ్ళీ కలుద్దాం అని చెప్పి బయలు దేరి వెళ్ళాడు సురేష్

రెండు రోజులు తరువాత పండు కూడా వల్ల అమ్మమ్మ గారింటికి బయలుదేరాడు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు అమలాపురం దగ్గర రావుపాడు మనోడు బస్సులో బయలుదేరి వెళ్లాడు బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాడు బస్సు కొంచెం రద్దీగానే ఉంది ఇంతలో ఒక అమ్మాయి వచ్చి " మిస్టర్ కొంచెం లెగుస్తారా ఆ సీట్ లేడీస్ ది అక్కడ ఓ పెద్దావిడ ఎప్పటి నుండో నుంచుని ఉంది అని సరికి పండు లేచి నుంచున్నాడు

ఇంతలో ఆ ముసాలవిడ దిగవాల్సిన స్టాండ్ వచ్చి ఆవిడ దిగిపోయింది వెంటనే ఈ అమ్మాయి కూర్చుని పోయింది ఇక చూడండి పండు గాడి మొహం కోపంతో మాడి పోయింది  ఆ అమ్మాయి మాత్రం అలాగే కూర్చుని పండు వైపు చూస్తూ సన్నగా నవ్వుతుంది

కాసేపటికి తను దిగవాల్సిన ఊరు వచ్చింది ఆ అమ్మాయి కూడా ఆ ఊరు లొనే దిగింది ఆ అమ్మాయి కూడా పండు
వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి పక్క ఇంటిలోకి వెళ్ళింది పండు కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంటి లోకి వెళ్ళాడు

పండు రాగానే ఎలా ఉన్నావు రా పండు అని అడిగింది వాళ్ళ అమ్మమ్మ బాగానే ఉన్నాను సరే తరువాత మాట్లాడుకుందాం ముందు నేను వెళ్లి స్నానం చేసి వస్తాను అని చెప్పి వెళ్ళాడు

స్నానం చేసి కాసేపటికి వచ్చాడు పండు పక్కింటిలో ఎవరు ఉంటున్నారు అమ్మమ్మ అనడిగాడు పండు
పక్కింటిలో వాళ్ళు మనకు దూరపు బంధువులు అవుతారు రా అనిచెప్పింది సరే అని అన్నాడు

ఆ మరుసటిరోజు సరదాగా బయటకు వెళ్దాం అనుకున్నాడు పండు వాళ్ళ అమ్మమ్మకి చెప్పాడు సరే వెళ్ళు అని చెప్పింది

పండు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంతలో ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది తను సైకిల్ చైన్ ఉడినట్టుంది వెంటనే మనవాడు చైన్ పెట్టడానికి వెళ్ళాడు
నేను ఏమైనా సహాయం చేయనా అనడిగాడు చేయమంటూ కొద్దిగా పక్కకు జరిగింది ఇక పండు గాడి ప్రతాపం చూపించి మొత్తానికి ఆ సైకిల్ చైన్ పెట్టాడు ఆ అమ్మాయి నవ్వుతూ థాంక్స్ అని చెప్పింది

నీ పేరు ఏమిటి అనడిగాడు పండు నా పేరు సౌజన్య అని చెప్పి వెళ్ళిపోయింది

అలా వారిద్దరి మధ్య మాటలు కలిసి చిన్న sige తొలి ప్రేమ పుట్టింది
ఇలా వారం రోజుల్లో మన వాడి ప్రేమాయణం సాగింది కానీ గమ్మత్తు ఏమిటంటే పండు గాని, సౌజన్య గాని ఒకరికొకరు ఆ విషయం గురించి చెప్పు కోలేదు

ఇంతలో పండు వాళ్ళ నాన్న ఫోన్ చేసాడు పండుని ఇంటికి రమ్మని ఎందుకంటే తన cousine brother గృహ ప్రవేశం ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య కూడా చెప్పు అని ఫోన్ పెట్టేసాడు

ఆ తరువాత రోజు ఎలాగైనా తన ప్రేమ విషయం చెబుదామనుకున్నాడు ఇంతలో luggage సర్దుకుని అమ్మమ్మ, తాతయ్య ready గా ఉన్నారు

పండు చాలా సేపు wait చేసాడు కానీ సౌజన్య బయటకి రాలేదు మరలా వచ్చి తన ప్రేమ విషయం చెబుదాం అని పండు ఉరికి బయలుదేరాడు

ఒక 4 రోజులు తరువాత మరలా తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు పండుతో పాటు, అమ్మమ్మ, తాతయ్య కూడా వచ్చారు

పండు సౌజన్య వల్ల ఇంటి వైపు చూసాడు కానీ ఇంటికి తాళం వేసి ఉంది కాసేపటికి వాళ్ళ అమ్మమ్మని అడిగాడు
పక్కింటి వాళ్ళు లేరు ఏంటి అమ్మమ్మ అన్నాడు వాళ్ళ నాన్న postman కదా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది అంటా అక్కడికి వెళ్లిపోయారు అని చెప్పింది

ఏ ఊరు అమ్మమ్మ అనడిగాడు పండు నాకు తెలియదు రా అని చెప్పింది

పాపం మన పండు గాడి పరిస్థితి mini size దేవదాసు లాగా మారిపోయాడు ఆ తరువాత రోజే అక్కడనుండి తన ఊరు వెళ్లి పోయాడు !!!

Tuesday, June 19, 2018

నీ స్నేహం చాలు (కవిత)నీ స్నేహం చాలు ఎందుకంటే
  బాధ అనే బరువుని తగ్గించుకోవడానికి నువ్వు ఉన్నావు కాబట్టి
నీ స్నేహం చాలు ఎందుకంటే
   ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో మంచి ఆలోచన ఇస్తావని
నీ స్నేహం చాలు ఎందుకంటే
 కన్న వారితోనైన కొన్ని విషయాలు పంచుకోగలం నీతో అన్ని విషయాలు పంచుకోగలం
నీ స్నేహం చాలు ఎందుకంటే
  నాలో ఆత్మ విశ్వాసం లోపించినప్పుడు నాలో ధైర్యం నింపుతావు కాబట్టి
నీ స్నేహం చాలు ఎందుకంటే
 నా విజయంలోనే కాదు నా అపజయం లో కూడా నా వెన్నంటే ఉంటావు కాబట్టి
నీ స్నేహం చాలు ఎందుకంటే
ఇంతకు మించి  జీవితానికి ఏమి కావాలి

నీ స్నేహం తోడు ఉంటే చాలు కలకాలం !!!


Nee sneham chalu endukante
   Badha ane baruvuni tagginchi kovadaniki nuvvu unnavu kabatti
Nee sneham chalu endukante
    Ye nirnayam tisukoleni paristitilo manchi alochana istavani
Nee sneham chalu endukante
  Kanna varito naina konni vishayalu panchukogalam kani neeto anni vishayalu panchukogalam
Nee sneham chalu endukante
  Naalo atma viswasam lopinchinappudu naalo dairyam nimputavu kabatti
Nee sneham chalu endukante
  Naa vijayamlone kadu naa apajayam lo kuda naa vennante untavu kabatti
Nee sneham chalu endukante
Intaku minchi ee jivitaniki yemi kavali

Nee sneham todu unte chalu kalakalam !!!

కలవరమాయే మదిలో (కథ)


బస్సు హారన్ వినగానే నిద్ర లేచాడు శ్రీ రామ్  తాను దిగవాల్సిన హైద్రాబాద్ వచ్చింది  ఆక్కడ దిగిన వెంటనే తన బాబాయ్ కనిపించాడు ఇద్దరు కలుసుకుని కులశా ప్రశ్నలు వేసుకుని తన బాబాయ్ జగన్నాధం ఇంటికి బయలుదేరాడు

ఇంటికి వెళ్ళగానే వల్ల పిన్ని కూడా పలకరించింది శ్రీరామ్ డిగ్రీ పూర్తి చేసి 1 సంవత్సర కాలం ఖాళీగానేఉంటున్నాడు  హైద్రాబాద్ లో ఏమైనా జాబ్ చూద్దామని రమ్మంటే శ్రీ రామ్ హైద్రాబాద్ వచ్చాడు సరే ప్రయాణంలో అలసిపోయి ఉంటావు రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకుందాం అని చెప్పాడు సరే అని చెప్పి వెళ్లి పడుకున్నాడు

ఆ తరువాత రోజు మొబైల్ రీఛార్జి చేయిద్దామని షాప్ కి వెళ్ళాడు  అక్కడ రీఛార్జి by mistake  ఒక నెంబర్ తేడాతో వేరే నెంబర్ కి వెళ్ళింది  షాప్ అతను " sorry భయ్యా by mistake వేరే నెంబర్ కి వెళ్ళిపోయింది నేను కస్టమర్ కేర్ ఫోన్ చేసి request పెడతాను మీరు ఒకసారి ఆ నెంబర్ కి ఫోన్ చేసి అమౌంట్ గురించి మాట్లాడండి అని చెప్పాడు

ఇలా అంటే ఎలా అని కొంత అసహనం తో మరలా రీఛార్జి చేయించుకున్నాడు సరే ఒకసారి ఆ నెంబర్ ఇవ్వండి అని చెప్పి ఆ నెంబర్ తీసుకున్నాడు
కాసేపటికి ఆ నెంబర్ కి ఫోన్ చేసాడు ఆ ఫోన్ చాలాసేపు రింగ్ అయింది చివరికి ఎవరో ఒక అమ్మాయి మాట్లాడింది
శ్రీరామ్ జరిగింది అంతా చెప్పాడు సరే మీ రీఛార్జి అమౌంట్ 499 మీకు రీఛార్జి చేయిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది

ఆ తరువాత రోజు  ఆ అమ్మాయి అన్నట్టుగానే ఆ అమౌంట్ రీఛార్జి వచ్చింది  thank you చెబుదామని ఫోన్ చేసాడు కానీ ఫోన్ పనిచేయలేదు సరే అని thank you అని message పెట్టాడు

ఆ తరువాత వాళ్ళ బాబాయ్ శ్రీ రాంతో నీకు ఒక జాబ్ చూసాను రేపు వెళ్ళు అని ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు శ్రీరామ్ ఆ జాబ్ కి వెళ్ళాడు అక్కడ జాబ్ లో జాయిన్ అయ్యాడు

ఇంతలో ఆ అమ్మాయి నెంబర్ నుండి message వచ్చింది  I love you అని వచ్చింది శ్రీ రాం కి ఏమి చేయాలో అర్థం కాలేదు వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేసాడు కానీ ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు

వెంటనే ఆ నెంబర్ ఫోన్ లో సేవ్ చేసి whatsapp లో చూసాడు  ఆ అమ్మాయి ఫోటో ఉంది ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచించాడు కానీ ఎంత ఆలోచించిన ఆ అమ్మాయి ఎవరో అర్థం కాలేదు
మరలా ఆ నెంబర్ కి ఫోన్ చేసాడు లిఫ్ట్ చేసింది ఆ అమ్మాయి అసలు ఎవరు నువ్వు అని అడిగాడు శ్రీరామ్
నేను మిమ్మల్ని లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మా sister marriage లో చూసాను మిమ్మల్ని అప్పుడే చూసి  ఇష్టపడ్డాను మీరు మొన్న ఫోన్ చేసినప్పుడు  మీ వాయిస్ విని మీ నెంబర్ సేవ్ చేసుకుని చూసాను నా అంచనా నిజమైంది అది మీ నెంబర్ అందుకే మీకు ఎప్పటినుండో చెప్పవాల్సింది ఇప్పుడు చెప్పాను అని అంది అమ్మాయి

ఇక శ్రీ రామ్ కి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు మీ పేరు ఏమిటి అని అడిగాడు నా పేరు భూమిజ అని చెప్పింది
అప్పటి నుండి మొదలైంది వారిద్దరూ మధ్య ప్రేమ !!!

Monday, June 18, 2018

బృందా అపార్టుమెంట్ (కథ)


పోస్ట్ మాన్ వచ్చి తలుపు తడుతున్నాడు కాసేపటికీ తలుపు తీసాడు జగదీష్ పోస్ట్ మాన్ చేతిలో ఎదో కవర్ ఉంది జగదీష్ అంటే మీరేనా అనడిగాడు పోస్టుమాన్ అవును అన్నాడు సరే ఇక్కడో సంతకం పెట్టి కవర్ తీసుకోండి అని చెప్పాడు సంతకం చేసి కవర్ తీసుకున్నాడు జగదీష్ ఓపెన్ చేసి చూసాడు తనకు వైజాగ్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చింది మరో 2 రోజులలో జాబ్ లో జాయిన్ అవ్వాలి ఈ విషయం ఇంట్లో ఉన్నవాళ్లు అందరికి చెప్పాడు వారు కూడా చాలా సంతోషించారు

మరి వైజాగ్ లో ఎక్కడ ఉంటావు అని అడిగాడు జగదీష్ వాళ్ళ నాన్న వెంకటేశ్వరరావు మా ఫ్రెండ్ శ్రీను అక్కడే ఉంటున్నాడు నాన్న వాడిని అడుగుతాను వాడి ద్వారానే కదా నాకు ఈ జాబ్ వచ్చింది అని చెప్పాడు జగదీష్
వైజాగ్ బయలు దేరి వెళ్ళాడు జగదీష్  శ్రీనుని కలుసుకున్నాడు శ్రీను తాను ఉండే రూంకి తీసుకువెళ్లాడు ఇద్దరు
కాసేపు మాట్లాడుకున్నారు ఆ తరువాత చాలా నైట్ అవ్వడంతో నిద్ర పోయారు

ఆ మరుసటి రోజు ఉదయం ఇద్దరు కలసి ఆఫీస్ కి వెళ్లారు ఆఫీస్ లో జాయిన్ రిపోర్టింగ్ ఇచ్చాడు అలా అలా మొదటి రోజు గడిచిపోయింది ఆ తరువాత రోజు కూడా మామూలుగానే గడుస్తుంది ఇంతలో మేనేజర్ జగదీష్ ని మనది ఇక్కడ మరొక బ్రాంచ్ ఉంది అక్కడకు  నువ్వు వెళ్ళాలి అక్కడ staff ఒకరు 1 month నుండి రావటం లేదు  అని చెప్పాడు మేనేజర్ ok sir అని చెప్పాడు జగదీష్

ఆఫీస్ అయిపోయిన తరువాత శ్రీను, జగదీష్ కలసి శ్రీను ఉండే రూమ్ కి బయలుదేరి వెళ్లారు జగదీష్ జరిగిందంతా చెప్పాడు శ్రీను ఆ బ్రాంచ్ ఇక్కడికి చాలా దూరంలో ఉంది మన వైజాగ్ కి ఆ ఊరికి సంబంధం ఉండదు అటు నుండి ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అనిచెప్పాడు శ్రీను

మరి అక్కడ రూమ్ ఎలాగా అన్నాడు జగదీష్ అక్కడ మనకు రూమ్ కంపెనీ వారు ఇస్తారు అక్కడ బృందా apartment ఉంది అది మన కంపెనీ కి సంబంధించింది అని చెప్పడు శ్రీను

జగదీష్ అక్కడికి బయలుదేరి వెళ్లాడు అక్కడ manager ని కలుసుకున్నాడు అటెండ్రర్ తో రూమ్ కి తీసుకెళ్లమని చెప్పాడు manager

Attender ఆ apartment కి తీసుకెళ్లాడు అక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంది అక్కడ మనుషులు కూడా ఎవరు కనిపించటం లేదు  ఆరోజు  fresh up అయ్యి పడుకున్నాడు జగదీష్ అర్థ రాత్రి దాటినా తరువాత ఏవో లారీ శబ్దాలు వస్తున్నాయి నిద్ర లేచి కిందకి చూసాడు ఎవరో కొందరు మనుషులు బాక్స్ లు లారీ లోకి load చేస్తున్నారు అడుగుదాం అనుకున్నాడు రేపు ఆఫీస్ అడగా వచ్చు అని చెప్పి తన రూం కి వెళ్లి పడుకున్నాడు

ఆఫీస్ కి వెళ్ళాడు జగదీష్ అక్కడ స్టోర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ స్టాక్ తీసుకుంటున్నాడు జగదీష్ కొంచెం దూరం లో నిన్న చూసిన బాక్స్ లు కనిపించాయి ఓపెన్ చేసి చూసాడు జగదీష్ అందులో expairy అయిన టాబ్లెట్స్, మందులు , సిరంజ్ లు ఉన్నాయి
మరో పక్కన కొత్త కవర్లు,  ఉన్నాయి వెంటనే అనుమానం వచ్చింది బయటకు వెళ్లి పోలీస్ లకి ఫోన్ చేసి చెప్పాడు

కొద్దీ సేపటి తరువాత పోలీస్ లు అక్కడికి వచ్చారు మొత్తం పరిశీలించి ఆ ఆఫీస్ కి సీల్ వేశారు ఆ manager ని అదుపు లోకి తీసున్నారు

ఆ manager ని విచారించగా ఉరికి దూరంగా ఉండడంతో ఎవరికి తెలిసే అవకాశం ఉండదు అనుకున్నాం ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన గణేష్ అనే స్టాఫ్ కూడా తెలిసింది మేము అతడ్ని చంపి ఇక్కడే పూడ్చి పెట్టాం వేరే బ్రాంచ్ వారికి ఈ విషయం తెలియదు అని మొత్తం పోలీస్ వారికి మొత్తం చెప్పాడు

పోలీస్ లు జగదీష్ ని అభినందించారు మరలా జగదీష్ తన వైజాగ్ బ్రాంచ్ లో జాయిన్ అయ్యాడు !!!

Sunday, June 17, 2018

నీకై (కవిత)


         నిన్నే చూడాలని
         నీతో ఉండాలని
    మదిలో కదిలే కడలిలా
  కనులలో కురిసే  జడివానలా
నాకు కనబడనంత వరకు కలలాగా
కనబడిన తరువాత ఊహకు అందని నిజంలాగా
ఎప్పుడు నాతో  నా ఊపిరి లాగా చిరకాలం  ఉంటావని
నీ కోసం ఎదురు చూస్తుంటాను !!!

Ninne chudalani
Neeto undalani
Madilo medile kadalila
Kanulalo kurise jadivanala
Naaku kanabadananta varaku kalalaga
Kanabadina taruvata uhaku andani
 nijam laaga
Eppudu nato naa upiri laaga chirakalam untavani
Nee kosam eduru chustuntanu !!!

Saturday, June 16, 2018

నాన్న అంటే (నా భావన )


నాన్న అంటే నడక నేర్పించేవాడు
నలుగురితో ఎలా ఉండాలో నడత నేర్పించేవాడు
నాన్న అంటే ధైర్యం
ఎంతటి బాధలో ఉన్న నెనున్నానని ధైర్యం చెప్పేవాడు
నాన్న అంటే కనబడని కష్టం
ఎంత కష్టపడి మనల్ని పెంచిన ఆ కష్టం మనకు
తెలియకుండా పెంచేవాడు
నాన్న అంటే నమ్మకం
మనకు మంచి భవిష్యత్ ఇస్తాడని
నాన్న అంటే క్షమించే గుణం
మనం చేసే తప్పుని తన తప్పుగా భావించి క్షమించే గుణం కలవాడు
నాన్న అంటే త్యాగం
తాను బాధను అనుభవించి మనకు సుఖాన్ని,సౌకర్యాన్ని అందించేవాడు
నాన్న అంటే బాధ్యత
నాన్న అంటే భరోసా
నాన్న అంటే నిర్వచించలేని భావం !!!

పరవశం (తెలుగు కవిత )


నీ పరిచయమే నాకు కల్గిన తొలి పరవశమై
నీ ఉసులుతో నా ఊపిరి తీస్తూ
నీ చూపులతో నాకు తియ్యని బాణం వేస్తూ
నా మది లో ప్రతి క్షణం ఏదో అలజడి రేపుతూ
నా కనులలో కలవై
నా మది నిండా మోయలేని బరువై
ఎప్పటికి నాతోనే ఉంటావని ఆశిస్తున్నాను !!!


Nee parichayame naku kaligina toli paravasami
Nee usuluto naa upiri teestu
Nee chupulu to  naaku tiyyani baanam vestu
Naa madilo prati kshanam edo alajadi  reputu
Naa kanulalo kalavi
Naa madi ninda moyaleni baruvi
Eppatiki natone unatavani aasistunnanu !!!

రాజావరంలో కంభం చెరువు (కథ)


ఫోన్ మోగుతుంది వెంటనే ఫోన్ అందుకున్నాడు ఇన్స్పెక్టర్ దయానంద్ " హలో సర్ రాజా వరంలో మళ్ళీ హత్య జరిగింది సర్ అని చెప్పాడు "  ఎక్కడ ఎవరు అని అడిగాడు దయానంద్ కంభం చెరువు దగ్గర సర్  అని చెప్పాడు అవతలి వ్యక్తి ok నేను వెంటనే బయలు దేరుతున్నాను అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్ తో బయలు దేరాడు దయానంద్ ఆ ఊరిలో వరుసగా అది 4వ హత్య

అక్కడికి చేరుకున్నాడు దయానంద్ అక్కడ ఉన్నవారిని investgation చేస్తున్నాడు దయానంద్ ఎవరు మాకు తెలియదు అంటున్నారు ఆ ఊరిలో జరిగిన 4 హత్యలు ఆ ఊరి సంభందించిన వారు కాదు బాడీని పోస్ట్ మార్టం పంపించారు  అక్కడ ఏమైనా క్లూస్ ఉన్నాయి ఏమోనని చుట్టూ వెతుకుతున్నారు కానీ చుట్టూ ఏ ఆధారం కనిపించలేదు కాకపోతే ఆ 4 హత్యలు ఆ కంభం చెరువు చుట్టూ పక్కల జరిగినాయి ఆ నలుగురు ఒంటిమీద
ఏ ఒక్క గాయం గాని, దెబ్బలుగాని లేవు ఇంతకు ముందు వచ్చిన పోస్ట్ మార్టం లో కూడా ఊపిరి ఆడక చనిపోయినట్టు వచ్చింది ఇంతలో ఒక ఆయన ఈ చనిపోయిన వ్యక్తిని తను ఎదో ఊరి లో చూశానని చెప్పాడు

కానీ గుర్తుకు రావడం లేదు సర్ అని చెప్పాడు ok మీరు ఇంటికి వెళ్ళండి మీకు ఎవరైనా చుట్టుపక్కల అనుమానాస్పదంగా కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అందర్నీ అక్కడ నుండి పంపించేశారు
కాసేపటికి దయానంద్ కూడా స్టేషన్ కి చేరుకున్నాడు ఎంత ఆలోచించిన ఈ కేస్ అసలు తేలటం లేదు అని ఆలోచిస్తున్నాడు ఇంటలో రాజావరం ప్రెసిడెంట్ విశ్వనాథం అక్కడికి వచ్చాడు ఇన్స్పెక్టర్ గారు ఎప్పుడు లేని విధంగా మా ఊరిలో హత్యలు జరుగుతున్నాయి  దీనికి సంబంధించిన హంతకులు ఎవరు అన్నది మీరు త్వరగా తెలుసుకోవాలి లేకపోతే గ్రామ ప్రజలు భయానికి గురి అవుతున్నారు అని చెప్పాడు మేము త్వరగానే ఈ కేస్ ని solve చేస్తాం అని చెప్పాడు ఆ ప్రెసిడెంట్ చూడటానికి చేతిలో కర్ర , పొగాకు నములుతూ ఉన్నాడు

దయానంద్ కి ఎందుకో ఆ హత్యాలలో ఈ ప్రెసిడెంట్ కి సంబంధం ఉన్నది ఏమోనని అనుమానం కలుగుతుంది
ఎందుకంటే ఆ 4 హత్యలు జరిగినప్పుడు ఆయన ఊళ్ళో లేరు అన్నారు  ఎందుకైనా మంచిది అని ఆ ప్రెసిడెంట్ మీద ఒక కన్ను వేసి ఉంచటం మంచిది అని కానిస్టేబుల్ కి చెప్పాడు దయానంద్

ఆ మరునాడు ప్రెసిడెంట్ ఎక్కడకో బయలుదేరాడు కానిస్టేబుల్ కూడా అతనికి తెలియకుండా అతనిని వెబడించాడు ఆ ప్రెసిడెంట్ కంభం చెరువు దగ్గరలో ఒక మూత పడిన ఫ్యాక్టరీ ఒక్కటి ఉన్నది అక్కడికి వెళ్ళాడు
ఇన్స్పెక్టర్ గారికి ఈ విషయం చెబుదామని ఫోన్ తీసాడు కానీ అక్కడ సిగ్నల్ దొరకటం లేదు అసలు ఏమి జరుగుతుంది అని మొత్తం తెలుసుకుని అప్పుడు చెబుదాం అని లోపలికి వెళ్ళాడు కానిస్టేబుల్ ఎవరో విదేశీయులతో మాట్లాడుతున్నారు వారిని చూస్తే ఎదో సైంటిస్ట్ లు లాగా ఉన్నారు కొంతమంది డాక్టర్స్ లాగా ఉన్నారు ఆ ప్రెసిడెంట్ తో చాలా సేపు మాట్లాడారు కాసేపటికి ప్రెసిడెంట్ కారులో తన ఇంటికి బయలుదేరాడు
కొద్దీ సేపటికి ఆ విదేశీయులు కూడా అక్కడి నుండి బయలు దేరి వెళ్లి పోయారు

కానిస్టేబుల్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చాడు అక్కడ జరిగిందంతా దయానంద్ కి తెలిపాడు సరైన సాక్ష్యం లేకుండా మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి ఆ ప్రెసిడెంట్ మరలా అక్కడికి వెళ్ళితే అప్పుడు పట్టుకుని విచారించ వచ్చు అని చెప్పాడు దయానంద్

అనుకున్నట్టే కొన్ని రోజులు తరువాత ప్రెసిడెంట్ బయటకు వెళ్ళాడు ఈ సారి దయానంద్ కూడా వెళ్ళాడు దూరం నుండి గమనిస్తూనే ఉన్నాడు ఆ విదేశీయులు సూట్ కేసులు ఆ ప్రెసిడెంట్ కి ఇస్తుండగా దయానంద్ ఒక ఉదుటున hands up అని చెప్పి ఏమిటి , ఇక్కడ ఏమి జరుగుతుంది అని అడిగాడు దానికి ప్రెసిడెంట్  ఏమి చేయాలో తెలియక నన్ను ఏమి చేయకండి సర్ నేను జరిగిందంతా చెప్పేస్తాను అని చెబుతున్నాడు

ఈ విదేశీయులు ఇక్కడకు టూరిస్టులు కింద ఇక్కడకు వచ్చారు సర్ ఇక్కడ ఎదో సంపద ఉందని ఈ చెరువు కింద సంపద ఉందని ఇక్కడ లభించిన సంపద లో.నాకు వాటా ఇస్తానని చెప్పారు అందుకే ఆశ పడ్డాను సర్ అన్నాడు ప్రెసిడెంట్

మరి ఆ 4 హత్యలు ఎందుకు చేశారు అని అడిగాడు  ఆ 4 గురు వ్యక్తులు ఈ ఊరి వారు కాదు సర్ పక్కనే ఉన్న పట్టణంలోని ఇంజినీర్లు సర్ వీరు ఆ సంపదని ఎవరికి తెలియకుండా ఆ సంపదని బయటకు తీసి ప్లాన్ చెప్పటానికి వాళ్ళను కలిశారు ఆ 4 గురు వ్యక్తులు ఒకరికి ఒకరు సంబంధం కూడా లేదు సర్ వీళ్ళకి వాళ్ళు చెప్పే ప్లాన్ నచ్చక వారిని ఎక్కడ బయటకు వదిలితే ఈ విషయం అందరికి చెప్పేస్తారు ఏమోనని వారి అందరిని చంపేశారు

వాళ్ళను చంపేసి ఆ చెరువు దగ్గర వల్ల శవాలను పడివేశారు, ఈ ఉరులో ఉన్న జనానికి ఇటు పక్కన చూడటానికి భయపడే విధంగా చేశారు అని ప్రెసిడెంట్ చెప్పాడు

కానిస్టేబుల్స్ వీళ్ళందరిని అరెస్ట్ చేయండి అని చెప్పాడు దయానంద్ !!!

Thursday, June 14, 2018

ప్రేమ భంగపాటు (కథ)


రైలు ఆగి చాలా సేపు అయినట్టుంది వెంటనే మెలకువ వచ్చింది నవీన్ కి లేచి మొహం కడుగుకుందామని రైలు భోగిలో ఉన్న bath room కి వెళ్ళాడు మొహం కడుక్కుని తిరిగి వస్తున్నాడు ఇంతలో కొందరు ప్రయాణికులు రైలు కిందకు డ్స్తుదిగి చూస్తున్నారు ఏమైంది అని అడిగాడు నవీన్ ఎదర track పాడై పోయింది అంటా రైలు బయలు దేరాటానికి టైం పడుతుందట అని చెప్పడు

 సర్లే అనుకుని కిందకి దిగాడు నవీన్ చుట్టూ ఎటు చూసినా చెట్లు అక్కడ కొంచెం దూరంలో ఒక గుడిసె లాగా ఉంది బహుశా అది డాబా అనుకుంటా అని నవీన్ అక్కడికి వెళ్ళాడు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని రైలు దగ్గరకు బయలుదేరాడు ఇంతలో రైలు horn వేశారు ఆ కంగారులో నవీన్ వేరే భోగి ఎక్కాడు next station లో తన భోగికి వెళ్ళ వచ్చని అక్కడే కూర్చున్నాడు  తన కూర్చున్న seat కి ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుని ఉన్నది

ఏమన్నా మాట్లాడాదం అంటే ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అని చెప్పి ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు ఇంతలో టికెట్ కలెక్టర్ దగ్గరలో వచ్చాడు నవీన్ తన టికెట్ వెతికాడు కానీ కనపడలేదు కంగారుగా మొత్తం తన జేబులు మొత్తం వెతికారు అయిన కనబడలేదు ఇక ఏమి చేయాలో తెలియటం లేదు
నవీన్ కి ఇంతలో ఆ అమ్మాయి గమనిస్తూనే ఉంది నవీన్ ని ఇక ఏమి చేయాలో తెలియక బాత్ రూమ్ లోకి వెళ్లి ఉండామనుకున్నాడు ఇంతలో ఆ అమ్మాయి నవీన్ కంగారు పడటం చూసి ఏమైంది అని అడిగింది

దానికి నవీన్ టికెట్ బ్యాగ్ లో ఉండిపోయింది ఆ బ్యాగ్ వేరే బోగీలో ఉండిపోయింది అని జరిగింది అంతా చెప్పాడు  ఆ అమ్మాయి మీరు ఏమి కంగారు పడకండి నేను fine కడతాను next వచ్చేది నేను దిగే స్టేషనే అక్కడ నా amount ఇద్దురు గాని అని చెప్పింది ఆ మాటతో కుదుట పడ్డాడు నవీన్ టికెట్ కలెక్టర్ వచ్చాడు ఫైన్ కట్టేసింది ఆ అమ్మాయి

చాలా థాంక్స్ అని చెప్పాడు నవీన్  ఇంతలో స్టేషన్ వచ్చింది నవీన్ వెంటనే తన భోగిలోకి వెళ్లి తన బ్యాగ్ లో అమౌంట్ తీసి ఆ అమ్మాయికి ఇచ్చేసాడు మీ పేరేమిటి అని అడుగుదాం అని అనుకున్నాడు ఇంతలో వాళ్ళ వారు ఎవరో వచ్చి  ఆ అమ్మాయిని తీసుకువెళ్లారు

కాసేపు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఈ రోజుల్లో ఈ విధంగా సహాయం చేసేవారు ఎవరుంటారు అని ఆ అమ్మాయి మీద ఒక అభిమానం పెరిగింది ఇక రెండు స్టేషన్ దాటినా తరువాత నవీన్ దిగవాల్సిన స్టేషన్ వచ్చింది
నవీన్ ఆ స్టేషన్ లో దిగాడు

ఇంటికి వెళ్ళాడు అందరూ కులసా ప్రశ్నలు వేశారు fresh up అయ్యిక కాసేపటికి వాళ్ళ నాన్న గారు వచ్చి రేపు నీకు పెళ్లి చూపులకు వెళ్తున్నాం రెడీగా ఉండు అని చెప్పి.వెళ్లిపోయారు

ఆ మరుసటి రోజు పెళ్లి చూపులకు బయలు దేరారు పెళ్లి చూపులు మర్యాదలు అన్ని మామూలుగానే జరిగాయి.పెళ్లి కూతుర్ని రమ్మన్నారు ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయే నవీన్ రైలులో కలసిన అమ్మాయి ఇక నవీన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది లోపల చాలా ఆనందంగా ఉన్నాడు

వెంటనే వాళ్ళ నాన్న తో అమ్మాయి నాకు నచ్చింది పెళ్లి ok చేయించండి అని చెప్పాడు ఇంతలో ఆ అమ్మాయి
వాళ్ల అమ్మను పక్కకు.పిలిచి జరిగింది అంతా చెప్పింది ఆవిడ వాళ్ళ ఆయనని పిలిచి చెప్పింది

కాసేపటికి ఆయన బయటకు వచ్చి ఏ విషయం అన్నది మీకు ఫోన్ చేసి చెబుతాం అని చెప్పి వారిని పంపించేశారు

ఆ తరువాత రోజు ఫోన్ వచ్చింది ఈ పెళ్లి ఆ అంమ్యకి ఇష్టం లేదంట అని చెప్పాడు పెళ్లి కూతురు తండ్రి
ఎందుకు అని అడిగాడు ఆయన జరిగినది అంతా చెప్పి అంతా బాధ్యత రహిత్యంగా ఉంటే రేపు నన్ను ఎలా చూసుకుంటాడో అని చెప్పి పెళ్లి cancle చేయండి అని ఫోన్ పెట్టేసాడు

నవీన్ వాళ్ళ తండ్రి నవీన్ పిలిచి చివాట్లు పెట్టాడు ఆ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు నవీన్ !!!

Tuesday, June 12, 2018

ఆ రోజు రాత్రి (కథ)


అసలే చీకటిపడింది పైగా వాతావరణం కూడా వర్షం వచ్చే లాగా ఉంది అని అనుకుంటూ తన కారులో బయలుదేరాడు రాజేష్ కొద్దీ సేపటికి వర్షం జోరు అందుకుంది  ఎదురుగా వచ్చే వాహనాలు ఏమి కనిపించటం లేదు రాజేష్ కి సర్లే వర్షం కొద్దిగా తగ్గాక వెళ్లవచ్చులే అని ఒక నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో కారు ఆపాడు రాజేష్ ఆ చుట్టూ పక్కల ఎవరు కనిపించటం లేదు ఎక్కడ చూసినా చెట్లు చాలా భయానక వాతావరణం లాగా ఉంది

దూరంగా ఎక్కడో ఆక్సిడెంట్ అయినట్టు పెద్ద శబ్దం వచ్చింది అటు వెళ్దాం అనుకుంటుంటుంటే వర్షం ఎక్కువ కావడంతో రాజేష్ అక్కడే ఉండిపోయాడు ఎంతసేపు చూసిన వర్షం తగ్గటం లేదు ఆ తరువాత కొద్దిసేపటికి వర్షం తగ్గింది రాజేష్ ఇంకా తన కారులో ఇంటికి బయలుదేరాడు

మొత్తానికి ఇంటికి చేరుకున్నాడు రాజేష్ రూంలోకి వెళ్లిన వెంటనే స్నానం చేసి కొద్దిగా పాలు తాగి పడుకున్నాడు
కొద్దీ సేపటికి ఎదో వింత శబ్దాలు వస్తున్నాయి ఏవో పిల్లులు అరుస్తున్నాయి అని అనుకున్నాడు రాజేష్ కానీ కొద్దీసేపటికి ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్లు వినిపించింది దానితో ఒక్కసారి రాజేష్ అలాగే ఉండిపోయాడు కాసేపటికి తేరుకుని ఆ ఏడుపు వచ్చే వైపు వెళ్ళాడు కానీ అక్కడ ఎవరు కనిపించలేదు కాసేపటికి మరలా రాజేష్ తన రూంకి వెళ్లాడు కానీ నిద్ర పట్టలేదు
ఎలాగోలా ఆ రాత్రి గడిచింది రాత్రి అంతా భయంగానే గడిపాడు అందుకే ఉదయం 3 గంటలకు నిద్ర పట్టింది అందుకే మరుసటి నిద్రలేటుగా లేచాడు ఆ రోజు ఆదివారం కావటంతో ఆఫీస్ కి కూడా సెలవు

రాజేష్ నిద్ర లేచే సరికి 12 దాటింది freshup అయ్యి తన బైకుపై బయటకు వెళ్తున్నాడు రాజేష్ అలా వెళ్తుండగా నిన్న రాత్రి శబ్దం వచ్చిన స్థలంలో చూస్తే చాలా మంది జనం గుమిగూడి ఉన్నారు రాజేష్ తన బైక్ పక్కన పార్క్ చేసి ఆ జనం దగ్గరికి వెళ్ళాడు అక్కడ చూస్తే పోలీస్ క్రాసింగ్ ఉంది ఏమైంది అని అక్కడ ఉన్న ఒక ఆయనను అడిగాడు రాజేష్ ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి ఆక్సిడెంట్ అయి చనిపోయింది అంటా ఇప్పుడే హాస్పిటల్ కి తీసుకెళ్లారు అని చెప్పాడు అయ్యో పాపం అనుకుని రాజేష్ బయలుదేరాడు  సినిమాకి వెళ్లి ఆ తరువాత ఇంటికి బయలుదేరాడు

ఇంటికి చేరుకుని డిన్నర్ చేసి పడుకున్నాడు రాజేష్ మరలా అవే శబ్దాలు వచ్చాయి ఇక రాజేష్ కి ఏమి చేయాలో తెలియటం లేదు ఈ సారి ఎదో ఒక పొగ రూపంలో ఆకారం కనిపించింది మరలా చేసేటప్పటికి మాయం అయిపోయింది ఇక ఎవరు నువ్వు అని గట్టిగా అరిచాడు అంతే మరలా శబ్దాలు వినిపించలేదు

మర్నాడు ఉదయం ఆఫీస్ కి బయలుదేరాడు ఇంతలో తన ఫ్రెండ్ కుమార్ ఫోన్ చేసాడు మన ఆఫీస్ లో కొత్తగా చేరిన అమ్మాయి స్వాతి ఆక్సిడెంట్ లో చనిపోయింది రా అని చెప్పాడు వెంటనే ఆఫీస్ కి బయలుదేరాడు

ఆఫీస్ లో అంతా గందరగోళంగా ఉంది ఇంతలో స్వాతి ఫ్రెండ్ రవళి పరిగెత్తుకుని రాజేష్ దగ్గరికి వచ్చింది ఏడుస్తూ స్వాతి మిమ్మల్ని ప్రేమిస్తుంది తాను చనిపోయిన రోజే ఆ విషయం మీకు చెబుదాం అని వచ్చింది ఇంతలోనే ఇంత దారుణం జరిగింది అని ఏడుస్తూ చెప్పింది

రాజేష్ కి ఏమి చేయాలో తెలియక కంటి నిండా కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడు కుమార్ దగ్గరకు వచ్చి ఏమైందిరా అనడిగాడు ఆరోజు ఆక్సిడెంట్ తనకు కొంచెం దూరంలో జరిగింది అని ఎప్పుడు కనుక వెళ్లుంటే కపడుకునేవాడినని నన్ను నేను ఎప్పటికి తన విషయంలో క్షమించు కోలేనని బాధపడ్డాడు !!!

Monday, June 11, 2018

సుబ్బి గాడి పెళ్లి చూపులు (కథ)


ఉదయం 7.గంటలు అవుతుంది ఇంటి ముందర పేపర్ చదువుతూ కూర్చున్నాడు రామారావు ఇంతలో ఫోన్ మొగుతుంది  ఫోన్ లిఫ్ట్ చేసాడు రామారావు

"హలో రామారావు గారు నేను నారాయణనని బాదంపూడి నుండి మా రెండో అబ్బాయికి పెళ్లి కుదిరింది ఆగస్టు లో మీరు మీ కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా రావాలి నేను శుభలేఖ పంపిస్తాను ఉంటానండి అని ఫోన్ పెట్టేసాడు నారాయణ

ఫోన్ మాట్లాడిన తరువాత రామారావు అలాగే కాసేపు ఉండిపోయాడు మా అబ్బాయి సుబ్రహ్మణ్యం కన్నా 2 సంవత్సరాల చిన్నోడు వాళ్ళ అబ్బాయి అప్పుడే పెళ్లి చేసేస్తున్నారు  అని ఆలోచిస్తున్నాడు రామారావు కొద్దీ సేపటికి కాఫీ పట్టుకుని వంట గదిలో నుండి బయటకి వచ్చింది వాళ్ళవిడ మంగతయారు

ఏమైందండి అలాగే ఉండిపోయారు అన్నది మంగ కాసేపటికి తేరుకుని వెంటనే మన సుబ్బుగాడికి పెళ్లి చేయాలి అని చెప్పాడు రామారావు ఏమైందండి అన్నది మంగ తయారు  ఏమిలేదే నారాయణ తెలుసుకదా వాడి 2వ కొడుకుకి కూడా పెళ్లి అయిపోతుంది మనవాడు వాడి మొదటి కొడుకు  ఒకే ఈడు వాడికి పెళ్లి అయ్యి.అప్పుడే సంవత్సరం కావొస్తుంది అప్పుడే 2 కొడుకుకి కూడా పెళ్లి కుదిరిపోయింది ఇంకా మనవాడికి ఎప్పుడు పెళ్లి చేద్దాము అని చెప్పాడు.రామారావు

వెంటనే పెళ్లిళ్ల పెరయ్యకి ఫోన్ చేసాడు రామారావు అతని దగ్గర కొన్ని సంబంధాలు ఉన్నాయి మీరు మా ఆఫీస్ కి
రండి నేను చూపిస్తాను అన్నాడు

ఆ మరుసటి రోజు రామారావు,మంగతయారు అక్కడికి వెళ్లారు అక్కడ వాళ్లకు ఒక అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయి వివరాలు కనుక్కుని ఆ ఊరు ప్రయాణం అయ్యారు అన్నట్టు సుబ్రహ్మణ్యం ని తీసుకుని ఆ ఊరికి బయలుదేరారు

ఆ ఊరు చేరుకున్నారు కానీ అడ్రస్ సరిగ్గా లేదు అంతలో ఒకాయన వచ్చి ఆ హడావుడి చూసి రండి, రండి ఇదే ఇల్లు రండి మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి లోపలికి తీసుకెళ్లారు  వెళ్లిన వెంటనే కూర్చున్నారు
కాసేపటికి పెళ్లి కూతురుని తీసుకు వచ్చారు చూడగానే నచ్చింది ఆ అమ్మాయి సుబ్బిగాడికి వెంటనే వాళ్ల అమ్మతో ok చెప్పమని సైగలు చేసాడు రామారావు కి కూడా ఆ అమ్మాయి నచ్చింది వెంటనే మిగతా వివరాలు మాట్లాడుకుంటున్నారు అంతలో మీ ఉరినుండి ఇక్కడకు రావటానికి ఇంత సమయం పట్టింది ఏమిటి అని.అడిగాడు పెళ్లి కూతురు తండ్రి అడ్రస్ తెలియక ఇబ్బంది పడ్డామని చెప్పాడు రామారావు

ఇంతలో పెళ్లిళ్ల పెరయ్య వచ్చాడు రామారావు గారు మీట్ మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే ఆ రోజు పెళ్లి కూతురు ఫోటోలు మారి పోయాయి ఈ అమ్మాయికి వేరే వారితో ఈ రోజే పెళ్లి చూపులు జరుగుతున్నాయి వీరికి కూడా పెళ్లి కొడుకు ఫోటో చూపించకుండానే డైరెక్టుగా పెళ్లి చూపులు ఏర్పాటు చేయటం జరిగింది
మనం చదవాల్సిన అమ్మాయి ఈ పక్కవీధిలో ఉంటారు అక్కడకు వెళ్దాం పదండి అని చెప్పి తీసుకెళ్తూన్నారు

ఇంతలో పెరయ్యని పక్కకు పిలిచి ఈ అమ్మాయి మావాడికి నచ్చింది ఈ సంబంధం ఖాయం చేయమని చెప్పాడు దానికి ఆ పెరయ్య ఏమి చెప్పాలో అర్థం కాలేదు మరి అవతల ఆ పెళ్ళివారు ఇక్కడకు వస్తారు కదా వాళ్ళని ఏమని ఒప్పించాలి అని అడిగాడు పెరయ్య

రామారావు మా వాడికి.అమ్మాయి నచ్చింది వాళ్లకు ఎదో ఒకటి చెప్పి పంపించండి అని చెప్పి బ్రతిమాలడాడు రామారావు అలాగే అని చెప్పి పెరయ్య అక్కడనుండి వెళ్ళిపోయాడు

లోపలికి వచ్చాడు రామారావు పెళ్లి కొడుకు తండ్రి మీరు ఆదికేశవులు కదా అనడిగాడు కాదు అని చెప్పి తన వివరాలు మొత్తం చెప్పాడు రామారావు పెళ్లి కూతురికి కూడా పెళ్ళికొడుకు నచ్చటంతో ఈ సంబంధమే ఖాయం అయ్యింది సుబ్బిగాడికి

పాపం పెళ్లిళ్ల పెరయ్య వాళ్ళను ఒప్పించటానికి ఎన్ని తిప్పలు పడ్డాడో !!!

Friday, June 8, 2018

ఆశా దీపం (కథ)


ఆఫీస్ కి బయలుదేరాడు శరత్  తన బైకుపై అసలే ఆలస్యం అయిపోతుందని చాలా కంగారుగా ఉన్నాడు అప్పుడే ట్రాఫిక్ సిగ్నల్ పడింది నిట్టూరుస్తూ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు అంతలో ఒక పెద్దాయన కొంచెం దూరంలో కనిపించాడు ఆయన చూస్తే శరత్ కి తన చిన్నప్పుడు తన పక్కింటిలో ఉండే వెంకట్రామయ్య గారిలాగా ఉన్నారని గుర్తు చేసుకున్నాడు ఆ పెద్దాయన చూడటానికి చాలా బక్కగా మురికి బట్టలతో ఉన్నాడు ఒక్కసారి శరత్ అలాగే ఉండిపోయాడు ఆ తరువాత సిగ్నల్ పడింది  తన ఆఫీస్ కి బయలుదేరాడు ఆ రోజు month ending ఫైల్స్ అన్ని క్లియర్ చేసేటప్పటికి రాత్రి 12.30 అయ్యింది  ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు
ఇంటికి చేరుకున్నాక  నిద్ర పోయాడు

ఆ మరుసటి రోజు ఆదివారం సెలవు కావటంతో లేటుగా నిద్ర లేచాడు నిన్న తను చూసిన పెద్దాయన గురించి ఆలోచించాడు ఆయన వెంకట్రామయ్య గారు ఆయనకు 10 ఎకరాల పొలం ఉంది అది వంశపార పర్యంగా సంక్రమించింది ఆయన దగ్గరకు వచ్చినవారికి లేదనుకుండా దానం చేసే సహృదయం కలవాడు ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు కూతురుకి అమెరికా సంబంధం చేశారు

ఇక కొడుకుకి బాగా చదివించారు  వెంకట్రామయ్య గారి భార్య సులోచనమ్మ ఆవిడ నా చిన్నపాటి నుండి మంచనికే పరిమితమయ్యారు మరి ఏమైందో తెలియదు ఇప్పుడు ఇలా కనిపించారు ఈ సారి కనబడితే అడగాలి అనుకున్నాడు ఆరోజు సాయంత్రం సినిమాకి వెళ్దాం అనుకుని బయలు దేరాడు శరత్ దారిలో మరలా కనిపించారు ఆ పెద్దాయన ఈ సారి దగ్గరికి వెళ్ళాడు శరత్

మీరు వెంకటరామయ్య గారు కదూ అనడిగాడు శరత్ ఆయన అవును అన్నారు మీరు ఇలా మారిపోయారు ఏంటి అనడిగాడు శరత్ దానికి ఆయన మా ఆవిడ 2 నెలల క్రితం కాలం చేసింది అందుకే అక్కడ ఉండలేక ఈ పట్టణానికి వచ్చేసాను అని సమాధానం చెప్పాడు మీకు అబ్బాయి ఉన్నాడు అనుకుంటా అన్నాడు శరత్
అవును ఉన్నాడు కానీ నన్ను ఈ ముసలి వయసులో ఇలా వదిలేసి పెళ్లి చేసుకుని ఫారిన్ లో  settle అయ్యాడు
కనీసం మా ఆవిడ చనిపోయిన తరువాత కూడా ఇంటికి రాలేదు బాబు అన్నాడు
 ఇంతకీ మీరు ఎవరు బాబు అనడిగాడు నేను శరత్ ని మీ ఇంటి పక్కనే ఉన్న రామచంద్ర రావు గారి కుమారుడిని అని చెప్పాడు శరత్

మీరు ఇలా మాసిన బట్టలతో ఉన్నరేంటి అనడిగాడు శరత్ దానికి  నేను ఇక్కడ పక్కనే ఉన్న apartment లో పనిచేస్తున్నాను అని చెప్పాడు వెంకట్రామయ్య అలా చెప్పగానే శరత్ కంటి లో నీళ్లు తిరిగాయి ఎక్కడుంటున్నారు అని అడిగాడు అక్కడే ఉంటున్నాను అని చెప్పాడు

సరే మా రూంకి రండి అని చెప్పి ఆయనను తీసుకెళ్తుండగా వద్దు బాబు నేను ఇక్కడే ఉంటాను దయచేసి ఏమి అనుకోవద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు

శరత్ అలాగే తను ఉంటున్న రూంకి బయలుదేరాడు గాని మనసు నిండా వెంకటరామయ్య గారి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు కన్న వాళ్ళని ముసలి వయసులో పట్టించుకోకపోతే వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చాలా బాధ పడ్డాడు కన్న తల్లి తండ్రులు తమ ఆశల్ని, తమ పుత్రులుపై
చూపిస్తారు వారు మాత్రం వారి అవకాశాలను చూసుకుంటూ తల్లి తండ్రులను వదిలేస్తారు అని శరత్ బాధ పడ్డాడు!!!

మంచి మాటలు !!!